పసిడి వన్నె అంచున్న చున్నీ తళుక్కున మెరవగానేవిక్రమ్ చూపు అటువైపు మళ్లింది. తెల్లటి చూడీదార్ వేసుకొని, ముంగురులపై వేళ్లను సవరిస్తూ, బస్సు చివరి మెట్టును దిగుతున్న ఆ అమ్మాయి,రాత్రి దీపాల వెలుగులో తేలిపోయే మృదువైన కాంతిలా కనిపించింది. ఆ కలువరేకులాంటి కనులు అతని చూపును తాకిన క్షణం, ఉప్పెనలా ఎగిసిపడిన మనోభారం ఒక్కసారిగా తగ్గి, ప్రశాంతత అలముకుంది. ఆమె వైపు చూపు మళ్లగానే, ఒక్క క్షణం ప్రపంచమంతా మసకబారిపోయింది… కానీ తను మాత్రం ఎంతో స్పష్టంగా, హృదయానికి దగ్గరగా కనిపిస్తోంది. అలా, విక్రమ్ మనసులో ఓ తీపి అలజడి మొదలైంది” “ ఆ అమ్మాయి ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ బస్ లోపలికి వెళ్ళింది..కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు విక్రమ్.. విక్రమ్ తలను ఎవరో కుడివైపు తిప్పారు, చూస్తే జయ “ ఏంట్రా ఊగిపోతున్నావ్ చలిగా ఉందా…” పోరా నువ్వు ఒకడివి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అంటూ మళ్ళీ తన కోసం ఎదురుచూడసాగాడు.“ ఏంటబ్బా వీడు, ఎప్పుడూ లేనిది కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు “,