అందరూ ఒకేసారి అరవడంతో ఫోన్ తన చెవి నుంచి దూరంగా పెట్టుకొని " అబ్బా... ఏంట్రా అలా అరుస్తున్నారు. ". అని అంది ప్రియా కొంచెం చిరాగ్గా. " స్వీటీ ఇది ఏప్రిల్ మంత్ కాదు ఏప్రిల్ దాటి చాలా రోజులు అవుతుంది మమ్మల్ని ఏప్రిల్ఫుల్ చేద్దామనుకుంటున్నావా ముందు ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అది చెప్పు మమ్మల్ని ఫుల్ చేయడం కాదు " అని అన్నాడు నితిన్. పొద్దున్నే నితిన్ కి జాగింగ్ చేసే అలవాటు ఉంది అలా జాగింగ్ చేసిన తర్వాత ఇంటి టెర్రస్ పైన ఉన్న అతని ఓపెన్ జిమ్ లో వర్కౌట్ చేయడం అతనికి అలవాటు రోజు లాగానే తన జీమ్ చేస్తూ ఉండగా ప్రియా వాళ్ళ ఇల్లు ఎవరో డెకరేట్ చేస్తూ కనిపించారు , అంత సడన్గా ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అనేది అతనికి అర్థం కాలేదు అతనికి ఫఫస్ట్ గుర్తొచ్చింది ప్రియా వాళ్ళ నాన్నమ్మ