"మిస్... మీరు బాగానే ఉన్నారా?"ఆ స్వరం వినగానే అనన్య ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తేరుకుంది.ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి ముఖం మీద నుంచి ఆమె చూపు మాత్రం మరలలేదు."అర్జున్..." అని మరోసారి నిదానంగా పిలిచింది.అతను ఆశ్చర్యంగా ఆమెను చూశాడు."క్షమించండి... మీరు ఎవరినో పొరబడుతున్నారు. నా పేరు ఆర్యవ్ సింగ్."అని అతను అనగానే,,"అబద్ధం!" అనన్య గొంతు వణికింది. "నాలుగేళ్లు ప్రేమించిన మనిషిని నేను గుర్తుపట్టలేనంటావా?"నువ్వు అబద్దం చెప్తున్నావ్ అని అంది ఆమె..ఆర్యవ్ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కాడు."కావ్య... ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి."అని చెప్పాడు అతను..అప్పుడే అతని అసిస్టెంట్ కావ్య వచ్చి నీళ్లు ఇచ్చింది..అనన్య చేతులు వణుకుతుండడంతో గ్లాస్‌ను కూడా సరిగా పట్టుకోలేకపోయింది."ప్లీజ్... కూర్చోండి," అన్నాడు ఆర్యవ్."నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా?" అని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి."లేదు."అని అన్నాడు అతను..ఆ ఒక్క మాట ఆమె గుండెను మళ్లీ ముక్కలు చేసింది.అప్పుడే ఆర్యవ్