వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ప్లీజ్, నువ్వు నీ మామ్ ఫాలో అయినా వే ని ఫాలో అవ్వకు. నీ సబ్స్టిట్యూట్ గా నీ హబ్బీ ని అప్పగించే ప్రయత్నం చెయ్యకు." వేడుకోలుగా అన్నాడు భుజంగరావు. గలగలా నవ్వింది సారిక. "నో డాడ్. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేనలా చెయ్యను." "మరి దేనికి అంత ఆలోచన?" నొసలు ముడేసాడు భుజంగరావు. "డాడ్............" గట్టిగా నిట్టూర్చింది సారిక. ".............ప్రస్తుతం నన్ను చూసుకుంటూ ఉంటే నాకే భయంగా వుంది. ఎం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకే బోధపడడం లేదు. అటువంటిది నేను మన బిజినెస్ కి అసెట్ కాగలనా?" "నో డియర్. నువ్వలా ఆలోచించకు." కూతుర్ని దగ్గరికి తీసుకుని తన ఎడమ బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు భుజంగరావు. "నీకున్నది కేవలం ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్. అది