భక్త శబరి

  • 1.5k
  • 519

భక్త శబరి కథ భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కథ కేవలం వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండలోనే కాకుండా, పద్మ పురాణము, భాగవత పురాణము మరియు విబ్భిన్న ప్రాంతీయ రామాయణాలలో భక్తి మార్గానికి పరమావధిగా కీర్తించబడింది. అరణ్యమధ్యంలో పంపానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ నదీతీరంలో మాతంగ మహర్షి తపస్సు చేసుకునే పరమ పవిత్రమైన ఆశ్రమం ఉంది. ఆ గురువును సేవించే ఒక గిరిజన మహిళ శబరి. ఆమె చిన్నతనంలోనే సంసార బంధాలను విడిచి ఆశ్రమంలో చేరింది. మునివృత్తానుసారంగా సత్యము, ధర్మము అనే సద్గుణాలను నేర్చుకుంది. ఆశ్రమంలో నిరంతరం రామనామ జపం, సీతారామ లక్ష్మణుల కల్యాణ గుణగణాలను వింటూ శబరిలో రామభక్తి అత్యంత ప్రగాఢంగా పెరిగింది. కాలక్రమేణా మాతంగ ముని తన అవసాన దశకు చేరుకుని శబరితో, "అమ్మా! నీ నిశ్చల భక్తికి శ్రీరామచంద్రుడే స్వయంగా ఈ దక్షిణ దారిలో వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు" అని పలికి