Part - 16 సమయం : సాయంత్రం 6:45 గంటలువిజయవాడకు వస్తున్న SIT వాహనంకారు విజయవాడ నగరంలోకి ప్రవేశించి కమిష్నరేట్ ఆఫీసు వైపుకి వెళుతోంది.సాగర్ వర్మ వాట్సాప్ లొ వంశి పంపిన PDF ఫైల్‌ను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాడు.ఫోటో క్రింద ఉన్న పేర్లు అతని మనసులో తిరుగుతున్నాయి.Dr. Madhav (డా. మాధవ్) Dr. Raghava Rao (డా. రాఘవ రావు)Dr. Anirudh Sen (డా. అనిరుద్ సేన్)సాగర్ చూపు మూడో వ్యక్తి పేరుమీదే ఆగిపోయింది.సాగర్ వర్మ : "డా. అనిరుద్ సేన్...?"అతను మెల్లగా మళ్ళీ చదివాడు.అప్పుడే...జాన్ బాబు ముందుకు వంగి అడిగాడు.ఎస్.ఐ జాన్ బాబు : ఏమైనా దొరికిందా సార్...?సాగర్ ఫోన్ అతనివైపు తిప్పాడు.జాన్ బాబు కూడా ఆ ఫోటో చూశాడు.కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు.ఎస్.ఐ జాన్ బాబు : సార్...ఈ పేరు...ఎక్కడో విన్నట్టుంది.సాగర్ అతని వైపు చూశాడు.సాగర్ వర్మ : ఎక్కడ...?జాన్ బాబు కాసేపు ఆలోచించాడు.హఠాత్తుగా అతని ముఖంలో గుర్తొచ్చిన భావం