ప్రణయ గీతిక - 3

  • 120

మొదటిరోజు ట్రైనింగ్ కోసం  ఆసుపత్రికి వచ్చిన ప్రభా గోవిందులు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.ఓ అయిదు నిమిషాల వ్యవధిలో కారు వచ్చి ఆగడంతో బలభీమ్ " మేడం "అంటూ లోపల్నుంచి పరిగెత్తుకొస్తుంటే "ఇదేందిరా అంబోతు రంకె వేస్తున్నట్టుంది "అన్న గురు గోవిందం చేతిని ప్రభా నొక్కడంతో నోరు మూసుకున్నాడు గోవిందు ఒరేయ్ వాడు పిలిచింది విన్నావా  "మేడం అని" అంటే లేడీ డాక్టర్ అన్నమాట లేడీస్ ఎప్పుడు కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారని విన్నాను ముందు   కామెడీ మాని అటువైపు చూడు " అనడంతో 'సరే 'అంటూ డోర్ వైపు  చూస్తుంటే  బలబీమ్ వెళ్లి కారు డోర్ ఓపెన్ చేయగా మేడం ఎలా ఉంటారో చూడాలని ఆత్రుతతో తొంగి చూస్తారు ప్రభా గోవిందులు .తలుపులని తెరవగా నే దిగిన  మేడంని చూసి  మేడం ఎంత స్లిమ్ గా ఉన్నారు అసలు వెటర్నరీ డాక్టరేనా?  అనిపిస్తుంది అంటూ ప్రభ పక్కకి నిలబడతాడు.రేయ్ కాసేపు మౌనంగా ఉండరా