యంత్రం వెనుక మనసు - 10

  • 654
  • 204

అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి సరిగ్గా పన్నెండు గంటలైంది. ఇల్లంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. నీల సడెన్‌గా కళ్లు తెరిచింది. బెడ్‌ పక్కన ఉన్న క్లాక్ వైపు చూసింది. టైమ్ కరెక్ట్‌గా 12:00 అయింది. ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది.మంచం దిగి, పిల్లిలా అడుగులు వేస్తూ నెమ్మదిగా ఆర్య రూమ్‌ వైపు నడిచింది. అక్కడ మూలలో అయాన్ చార్జింగ్ పెట్టుకుని, కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. నీల చాలా సైలెంట్‌గా లోపలికి వచ్చి, నిద్రపోతున్న ఆర్యను భుజం తట్టి లేపింది. అదే సమయానికి రాజు గారు, కాస్త నిద్రమత్తులో చిరాకు పడుతూనే సుస్మిత గారు కూడా ఆర్య గదిలోకి అడుగుపెట్టారు. రూమంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది.అందరూ ఒకరినొకరు చూసుకుంటూ నెమ్మదిగా అయాన్ దగ్గరకు వచ్చారు. నీల చేతిలో ఉన్న క్యాండిల్‌ని ఒక్కసారిగా వెలిగించి, అందరూ కలిసి ఒకే గొంతుతో, "హ్యాపీ బర్త్ డే అయాన్!" అని ప్రేమగా