అసంపూర్ణ కావ్యం - 7

  • 48

వెన్నెల నిశ్శబ్దంగా తోటలోకి అడుగుపెట్టింది. కిషోర్ ముఖంలో అలజడి కనిపిస్తున్నా, చదువులో ఫెయిల్ అయిన విషయం తనకు తెలియనట్టే చాలా సహజంగా నటించింది. ప్రకృతి గురించి, పక్షుల గురించి కాసేపు కబుర్లు చెప్పాక, మెల్లగా కాలేజీ విషయాలు తీసింది. "మీకు కాలేజీలో ఎవరైనా లవర్ ఉన్నారా?" అని ఆమె అల్లరిగా అడిగేసరికి కిషోర్ ఒక్కసారిగా సిగ్గుపడిపోయాడు. "అవును" అన్నట్టు నెమ్మదిగా తల ఊపాడు కానీ, ఆ పేరు మాత్రం బయట పెట్టలేదు. వెన్నెల అతన్ని ఆటపట్టిస్తూ, "చెప్పండి.. ఎవరావిడ? అంతటి అదృష్టవంతురాలు ఎవరు?" అని పట్టుబట్టింది. ఆ నవ్వుల మధ్యే మెల్లగా ఫెయిల్ అవ్వడం గురించి ప్రస్తావించి, "జీవితంలో గెలుపోటములు చాలా సహజం కిషోర్.. ఈ మాత్రం దానికి అన్నం మానేసి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారా? ప్రాణం ఉంటేనే కదా రేపు మళ్ళీ గెలవగలం!" అని ధైర్యం చెప్పింది. ఆ రోజుకు కిషోర్ ముఖంలో మళ్ళీ పాత నవ్వు చూసి జానకమ్మ,