అసంపూర్ణ కావ్యం - 6

  • 636
  • 162

వెన్నెల మాటలకు ముగ్ధుడైన కిషోర్, ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. ప్రకృతిలో ఇన్ని రహస్యాలు, ఇంతటి నిశ్శబ్దమైన ప్రేమ దాగి ఉన్నాయని ఆమె చెప్పే వరకు అతనికి తెలియదు. "కిషోర్ గారు.. కిషోర్ గారు!" అని వెన్నెల పిలిచేసరికి స్పృహలోకి వచ్చిన అతను, "ఇంత చక్కని విషయాలు చెప్పిన నీకు ప్రతిగా ఏమివ్వాలో ఆలోచిస్తున్నాను వెన్నెలా" అన్నాడు. అప్పుడే అతని చూపు ఆ అరుదైన నీలం రంగు గులాబీ మొక్క మీద పడింది.వెంటనే ఆ చెట్టునే తీసుకొని వచ్చి వెన్నెల చేతిలో పెట్టాడు. "ఇదంటే నీకు ప్రాణం కదా.. మరి నాకెందుకు ఇస్తున్నారు?" అని వెన్నెల ఆశ్చర్యంగా అడిగింది. కిషోర్ పెదవులపై ఒక అర్థవంతమైన నవ్వు చిగురించింది. "నా ప్రాణాన్నే నీకు ఇస్తున్నాను అనుకో.. కనీసం నా ప్రాణాన్నైనా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేవా?" అన్నాడు. ఆ మాటల్లోని నిగూఢమైన ప్రేమను అర్థం చేసుకున్న వెన్నెల, సిగ్గుతో తలవంచి "చిత్తం!" అంటూ