వెన్నెల పూలు - 13

  • 345
  • 102

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “అంత అవసరం నాకు లేదు.” వాడు కోపంగా అని , కళ్ళు మూసుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. “నేనది చేసుండకూడదు. నేనది చేసుండకూడదు. తప్పు చేసాను.” “నువ్వు ఏం చేసుండకూడదు. ఏం తప్పు చేసావ్?” “నేను తప్పుచెయ్యడం కాదు, వాడలా గొణుక్కున్నాడు. ఇంకా ఏమన్నాడంటే “అలా అవుతుందనుకోలేదు.” “ఏంటలా అవుతుందనుకోలేదు?” “నాకెలా తెలుస్తుంది? వాడు గొణుక్కున్నది చెప్తున్నాను.” చిరాగ్గా అన్నాడు వాడు. వీడు అబద్ధం చెప్పడం లేదు. వీడు చెప్పినదానికి, జరిగినదానికి సింక్ అవుతూంది. తరువాత ఇంకొన్ని నిమిషాలకి వాడు అన్నాడు. “ఇంక ఎంత ఆలోచించినా అంతకన్నా గుర్తుకురావడం లేదు. ఎదో మందుకోసం వాడు మాట్లాడనిది నీకు కల్పించి చెప్పలేను.” “ఒకే. ఈ వెయ్యి రూపాయలు ఉంచుకుని, నీకు కావలసినంత తాగు.” ఒక రెండు ఐదువందల రూపాయల నోట్లు వాడి జేబులోపెట్టి,