యంత్రం వెనుక మనసు - 6

  • 174

షీలా! నువ్వేంటి అసలు మాట్లాడటం లేదు? ఏం చేస్తున్నావు షీలా?" అంటూ నీల తన భుజం మీద చేయి వేసేసరికి, షీలా ఉలిక్కిపడింది. అప్పటిదాకా ఆమె అయాన్ వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది.అప్పుడు నీల, "ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న నీకు ఫోన్లో చెప్పాను కదా.. ఇతనే అయాన్! అయాన్, తను నా స్నేహితురాలు షీలా," అని పరిచయం చేసింది. దానికి షీలా, "అవసరం లేదు నీలా.. ఇందాకే మాకు పరిచయం అయ్యింది," అని కొంచెం సిగ్గుపడుతూ అంది.నీలకు అర్థం కాలేదు. 'షీలా ఎందుకు అంతలా సిగ్గుపడుతోంది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది?' అని తనలో తాను ఆలోచించుకోసాగింది. అప్పుడే సుస్మిత కాఫీ పట్టుకొని వచ్చింది. షీలా కి ఇస్తూ "నీలా! కాలేజీకి వెళ్ళావు కదా.. అప్పుడే వచ్చావేంటి?" అని అడిగింది."లేదమ్మా, ఈరోజు సార్ రాలేదని సెలవు ఇచ్చారు," అని చెప్పింది నీల."మరి అన్నయ్య ఎక్కడ?" అని అడిగితే, "అన్నయ్యకు