అలా రోజులు గడుస్తున్నాయి.. వెన్నెల ఎప్పటిలాగే తన గులాబీ మొక్కలకు నీళ్లు పోస్తూ, మురిపెంగా ముచ్చట్లు చెప్పుకుంటోంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. మళ్ళీ మొదలుపెట్టింది ఈ పిచ్చిది! ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు" అంటూ విసిరేసిన మాటలు వెన్నెల మనసుని చివుక్కుమనిపించాయి. అప్పుడే వాళ్ళ అమ్మ శారద మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారి గా ఎవరో ఇక చాలు అన్నట్టు అనిపించింది ఎవరు అని వెనుకకు తిరిగి చూస్తే సరిగ్గా అప్పుడే.. "ఆమె చేస్తున్న తప్పేమిటి?" అన్న ఒక గంభీరమైన గొంతు వినిపించింది. "మొక్కలకి ప్రాణం పోస్తూ, వాటితో కాలం గడపడం నేరమా? అది పిచ్చితనం కాదు, ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమ" అంటూ ఒక వ్యక్తి ఆమెకు అండగా నిలబడ్డాడు. వెన్నెల ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. సుమారు 5.6 అడుగుల ఎత్తు, మెరిసే కళ్ళు, ముఖంలో