యంత్రం వెనుక మనసు - 4

  • 894
  • 318

"ఏమిటో చెప్పు ఆర్య, తప్పకుండా చేస్తాను" అన్నాడు అయాన్ తన మెకానికల్ వాయిస్‌లో."మా చెల్లి ఉంది చూడు.. ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఈసారి నేను దాన్ని ఆటపట్టించాలి. ఏం చేసినా తనే గెలుస్తోంది, నేనే ఓడిపోతున్నాను. తనకి నా మీద భయం పుట్టాలి. నా పేరు వింటేనే గజగజ వణికిపోయేలా ఏదైనా ఐడియా ఉంటే చెప్పు" అని అడిగాడు. అలా తన పేరు చెప్పగానే నీల భయపడిపోవాలని ఊహించుకుంటూ ఆర్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.వెనుక నుండి నీల వచ్చి ఆర్య నెత్తి మీద ఒక్కటి చరిచింది."అది ఎప్పటికీ జరగదు లేరా అన్నయ్య! ముందర రా.. అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటోంది" అంటూ గట్టిగా నవ్వుతూ అక్కడి నుండి పారిపోయింది. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్య నోరెళ్లబెట్టాడు.అందరూ టిఫిన్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్లేట్లలో వేడివేడి దోశలు ఆవిర్లు కక్కుతున్నాయి. నీల పక్కనే కూర్చున్న ఆర్య, ఆమె వైపు