మరుసటి రోజు ఉదయం.. ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంది. అయాన్ ఇంటి పనులన్నింటినీ ఎంతో చకచక చేసేస్తున్నాడు. వంటగదిలో సుస్మిత టిఫిన్ చేయడంలో నిమగ్నమై ఉండగా, రాజు గారు అక్కడికి వచ్చారు."ఏమిటి సుస్మిత.. ఇవాళ ఏం టిఫిన్? ఈ దోశలు ఎప్పుడూ నీ ముద్దుల కొడుకు కోసమేనా లేక మా కోసం కూడా ఏమైనా మిగిల్చావా?" అని రాజు గారు సరదాగా అడిగారు. సుస్మిత నవ్వుతూ, కంటి సైగతో పక్కనే ఉన్న హాట్ బాక్స్‌ని చూపించింది.అందులో వేడివేడి పూరీలు పక్కనే పూరి కూర్మ చూసి రాజు గారు మురిసిపోతూ, "థాంక్యూ మై బెటర్ హాఫ్!" అంటూ ఆమె బుగ్గ గిల్లుతుండగా.. సరిగ్గా అదే సమయానికి నీల అక్కడికి వచ్చింది. అమ్మానాన్నల అన్యోన్యతను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెనుతిరిగింది.బయటకు రాగానే అయాన్ ఎదురై, "గుడ్ మార్నింగ్ నీల!" అన్నాడు. ఆ పిలుపు వినగానే నీల గుండెలో ఏదో