వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “అనవసరం గా గాభరా పడకు.” అప్పటికి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకున్న సమీర, అతనికి దగ్గరగా వెళ్ళి, అతన్ని సున్నితంగా కౌగలించుకుని, అతని ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టింది. “ఇలా వచ్చి కూచో. నువ్వెవరో, ఈ ప్లేస్ ఏమిటో, నువ్వు ఇక్కడకి ఎలా రావాల్సి వచ్చిందో అంతా వివవరంగా చెప్తాను. అదివిన్నాక బహుశా నీకు నీ గతం అంతా గుర్తుకు రావచ్చు.” అరవింద్ ని అక్కడ బెడ్ ఎడ్జ్ మీద సెటిల్ చేసి, తనూ అతనికి ఎడమ పక్కన కూచుని, నెమ్మదిగా అతనెవరో, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి ఎలా వచ్చాడో, తనెవరో అంతా వివరం గా చెప్పింది. “ఏమిటీ? ఒక వారం రోజులుగా నేను ఇలా వున్నానా?” మరోసారి అతని మొహం ఆశ్చర్యం, దిగ్భ్రమ తో