లక్ష్మి కళ్లలో నిప్పులు కురుస్తుండగా, గొంతులో వేదనతో అతడిని నిలదీసింది. "నిజమే.. నేను వేశ్యనే! కానీ నేను ఎలా అయ్యానో నీకు తెలుసా? నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు.. ఆకలితో రోడ్డు పక్కన ఏడుస్తుంటే జాలి చూపించకుండా తన్ని తరిమేశారు. ఆకలి తీర్చడానికి ఒక్క మెతుకు కూడా పెట్టని ఈ లోకంలో, ఒకడు నన్ను ఆశ్రయం ఇస్తానని ఇక్కడికి తెచ్చి వాడి డబ్బు అవసరమని అమ్మేశాడు. వయసు కూడా తెలియని స్థితిలో ఒక ముసలివాడికి నా శరీరాన్ని వాడు పువ్వు ను నలిపినట్టు నలిపి నాకు నరకం చూపించాడు. అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతే, పని ఇస్తానన్న మరో మృగం నన్ను నమ్మించి నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా తన కోరిక తీరే వరకు వాడుకుంటూనే ఉన్నాడు అది సరిపోలేదని వాడు మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడుప్రతివాడు నా శరీరాన్ని చూశాడే