యంత్రం వెనుక మనసు - 2

  • 249
  • 81

నీలా ! నువ్వు ఏది అడిగినా అమ్మ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంది కదా, నేనేమైనా అన్నానా చెప్పు? మరి ఇప్పుడు నాన్న నాకు సపోర్ట్ చేస్తే నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు?" అని నీలా తన అన్న ఆర్య నీ ఆటపట్టించింది.రాజు నవ్వుతూ, "సరే సరే ఇంకా చాలు.. ఇప్పటికే మీ అల్లరి ఎక్కువైంది. నీలా! ఇప్పటికైనా ఆ రిమోట్‌లో బటన్ నొక్కు" అన్నాడు. నీలా బటన్ నొక్కగానే.. కొంచెం 'కిర్' అనే శబ్దం వచ్చి ఆగింది. రాజు వెంటనే "ఆ బ్లూ కలర్ బటన్ కూడా ప్రెస్ చేయి" అని చెప్పగానే నీలా అది నొక్కింది. వెంటనే ఆ బాక్స్ లో నుండి ఒక రోబో బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే నీలా అలా ఉండిపోయింది. ఆరడుగుల ఎత్తు, ఆపిల్ పండు లాంటి ఛాయ, నీలం రంగు కళ్లతో అతను అచ్చం మనిషిలాగే ఉన్నాడు. మనీషా ఇంతకి రోబో నా ?