వెన్నెల పూలు - 3

  • 1.2k
  • 415

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దానితో తనూజ కి ఇంక కాదనడానికి అవకాశం కనిపించలేదు. పరంధామం, తనూజ కూడా ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండా సహాయం చెయ్యడం మొదలు పెట్టాడు. సమీర, తనూజ ఎమన్నా అన్నా అతను అనే మాట ఒక్కటే. “మీ దగ్గర నేను వడ్డీ తో సహా ఇదంతా వసూలు చేస్తాను. ప్రస్తుతం కాదనవద్దు.” ఇదిలా ఉండగా ఒకరోజు మాణింగ్ పది అలా అవుతూ ఉంటే పరంధామం ఇంటికి వెళ్ళింది తనూజ. ఆ సమయానికి పరంధామం ఎదో పనిచేసుకుంటూ వున్నాడు. "ఇంకా ఎమన్నా సహాయం కావాలా?" తనూజ మొహంలోకి చూస్తూ అడిగాడు అయన. "ఏదయినా సహాయం అడిగే పరిస్థితి రానిస్తున్నారా? అడక్కుండానే చేస్తున్నారుగా." నవ్వింది తనూజ అక్కడున్న కుర్చీలో కూలబడుతూ. "మరయితే ఇప్పుడొచ్చిన కారణం తెలుసుకోవచ్చా?" ఇంకా ఆమె మొహంలోకే చూస్తూ అడిగాడు.