వెన్నెల పూలు - 2

(35)
  • 1.3k
  • 558

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మీరు మాత్రమే ఆ బంగ్లా లోకి వెళుతూ వుంటారా? ఇంకెవరూ యూజ్ చెయ్యరా?" సమీర అడిగింది. "ఎక్కువగా వెళ్ళేది నేనే. నా కొడుకు అరవింద్, కూతురు సుస్మిత అప్పుడప్పుడు మాత్రం వస్తారు. నాకున్న లాంటి అటాచ్మెంట్ వాళ్ళకి ఆ బంగ్లా తో లేదు. నాకున్న అటాచ్మెంట్ వల్ల, నా సర్వెంట్ డిబ్బూ ని తీసుకుని నేను మాత్రం కుదిరినప్పుడల్లా, ఇంకా ఆదివారాలు ఉదయం పూట ఆ బంగ్లా కి వెళతాను." అందావిడ.  చిన్నగా నవ్వింది సమీర అది వినగానే. “మీకెందుకు అలాంటి ఆటాచ్మెంట్ ఆ బంగ్లాతో?” “అది నేను నా భర్త వర్ధన్ వర్మ ఎంతో ఆనందంగా, సంతోషంగా కాలం గడిపిన ప్రాంతం. నా జీవితం లోనే అంత సంతోషంగా ఆనందంగా అక్కడ నా భర్త తో గడిపినట్టుగా ఇంకెక్కడా గడపలేదు.