దుర్గాప్రసాద్ వెంటనే ఫోను తీసి ఒక నెంబర్ కు డయల్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తగానే, "ఏంటి భుజంగం గారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. విషయం నా వరకు వచ్చింది "అంటూ వెహికల్ నెంబర్ చెప్పాడు. అవతల వైపు నుంచి," మేము ఇలాంటి చిల్లర పనులు చేయము, కానీ ఆ నెంబర్ వెహికల్ మాత్రం నా అనుచరుడు సూరిగానిదే. ఏవైనా చిల్లర డబ్బులకు ఆశపడి చేసి ఉంటాడు. ఇందులో నాకు గాని, మా తండ్రికి గానీ సంబంధం లేదు. వాళ్లకు డబ్బులు ఇచ్చి అమ్మాయిని విడిపించుకోమని చెప్పండి. అమ్మాయికి మాత్రం ప్రా ణభయం ఉండదు "అంటూ ఫోన్ పెట్టేశాడు. దుర్గాప్రసాద్ కానిస్టేబుల్ తో" నగరంలో నిన్న కానీ ఈరోజు కానీ ఏవైనా కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయేమో కనుక్కోండి "అనడం కార్తీక్ వింటూ నడుస్తున్నాడు... ఇక లాభం లేదనుకొని ఎస్ఐ రాందేవ్ కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. వెంటనే పోలీస్