మిలియన్ డాలర్ ప్రశ్న...ప్రేమించుకున్నాము అర్థం చేసుకున్నాము మాది నిజమైన ప్రేమ పవిత్ర ప్రేమ అని వంద మాటలు చెప్పే ఇప్పటి తరంఎప్పుడు విడిపోతారో ఎన్నాళ్లు కలిసి ఉంటారుకూడా ఎందుకు చెప్పలేముపెళ్లిదాకా కనీసం ఒకరినొకరు చూసుకోకుండా కేవలం తల్లిదండ్రులు చెప్పారు అనే ఒక్క మాటతో కష్టాల్లో నైనా నష్టాల్లోనైనా జీవితాంతం కలకాలంతోడుండే అప్పటి తరానికి తేడా ఏంటి?????తేడా ఒక్కటే... బంధం పై ఉండే గౌరవంముఖ్యంగా ఈ గౌరవం భార్యాభర్తల్లో ఉంది.విడిపోవడం అనే మాటని కనీసం ఆలోచనల్లో కూడా రానివ్వని అప్పటి మనుషులు బంధానికి కట్టుకున్న వాళ్ళకిఎంతో గౌరవాన్ని ఇచ్చే మనసులు.వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్నారు అంటే దాని అర్థంవాళ్ల మధ్య కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు లేవని కాదుఏవి ఉన్నా కూడా వాటన్నింటినీ సమానంగా స్వీకరించారు అందుకే కలకాలం కలిసి ఉన్నారు.భార్యాభర్తల బంధమే కావచ్చు స్నేహితుల బంధమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కలకాలం కలిసి ఉండాలి అంటే ప్రేమ ఉండడం ఎంత ముఖ్యమో...ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండడం కూడా అంతే ముఖ్యం.నా ఉద్దేశంలో