యశోద తొమ్మిది నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మూడు అంతస్తులు ఎక్కి ఏపీ స్లట్ పరీక్ష రాసి పాస్ అయ్యింది .తర్వాత డెలివరీ కి , పుట్టింటికి వెళ్లి , ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. యశోద బాబుకు 5 నెలలు నిండి, ఆరో నెల రాగానే పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళింది . అప్పుడే ఆఖరి ఆడపడుచు కి పెళ్లి కుదిరింది. చంటోడికి సంవత్సరం ఆరు నెలలు వచ్చేవరకు అత్తగారింట్లో ఉంది .సాకేత్ అమ్మ ను చూస్తే ఎవ్వరు పిలిచినా వెళ్ళడు.యశోద పిల్లవాణ్ణి ఎక్కువసేపు వదిలిపెట్టి అస్సలు ఉండదు. సాకేత్ని ఎవ్వరికీ ఎక్కువ సేపు ఇచ్చేది కాదు. యశోద డెలివరీ కి వెళ్ళినప్పుడు ఈమె భర్త అర్జున్ ఆలోచించి ఎంఫిల్ అప్లికేషన్ నింపి యూనివర్సిటీలో సబ్మిట్ చేశారు. యశోద అత్తగారిది చాలా పెద్ద కుటుంబం. మామయ్య వ్యవసాయం చేసేవారు. కొబ్బరి ,జీడి మామిడి ముఖ్యమైన పంటలు.