మీ అమ్మ నిన్ను కని అది చచ్చింది... నిన్ను నేను చేర తీసి తీసుకువచ్చి నువ్వు చావకుండా చూసుకున్నందుకు ఇప్పుడు నీకు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది..! అదైనా నిలబెట్టుకొని ఏడువు అని కచ్చితంగా చెప్తారు కనుక మహాలక్ష్మి గారు.... మరి నానమ్మ నేను అక్క ఒకటి కాదని తెలిస్తే అని భయంగా అడుగుతుంది సహన... *************1 గంట తర్వాత....పూజారి గారు మంగళ వాయిద్యం వాయించండయ్యా అని... పెళ్లి కొడుకు చేతికి తాళిని ఇచ్చి పెళ్లికూతురు మెడలో కట్టయ్యా అంటారు....ఆ పెళ్ళికొడుకు ఎంతో సంతోషంగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని సహనా మెడలో తాళిని కట్టి ఆమె మెడపై గట్టిగా గిల్లుతాడు....సహన ఉలిక్కిపడి అమ్మ... అని చిన్నగా అంటూ ఉంటే కనకమహాలక్ష్మి గారు మండి పడిపోతూ వీడికి అస్సలు ఆగట్లేదు కదా..! అంటేఅయ్యో బంగారం లాంటి నా కూతురు