అది ఒక పెద్ద కళ్యాణమండపం అక్కడ పెళ్లి జరగడానికి కావలసినవన్ని సిద్ధం చేసి పెళ్ళికొడుకుపిలిపించారు. అతను వర పూజ చేస్తూ ఉండగా అతని మొహంలో కళాకాంతులు వెలిగిపోతూ కనిపిస్తున్నాయి... అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు తను ప్రేమించిన అమ్మాయి వచ్చి అతని పక్కన నిలబడుతుంది..! ఎప్పుడు తనకి సొంతమవుతుంది.. అని అనుకోనినా ప్రేమ నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూపిస్తాను.. పెళ్ళికి ముందు నిన్ను టచ్ చేస్తే... అది పవిత్ర బంధం అవ్వదు...అలా నువ్వు దేని దగ్గర కూడా తక్కువగా ఫీల్ అవ్వకూడదు.... అని తనని తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ పూజ చేస్తూ ఉన్నాడు....అప్పుడే అక్కడికి పెళ్లికూతురు అమ్మ అయినా కావేరి గారు గబగ వచ్చి అత్తయ్య... అత్తయ్య... అది మరి అని నానుస్తూ ఉంటే...దవడ పగిలిపోద్ది త్వరగా చెప్పకపోతే అని కసురుకుంటారు కావేరి అత్త కనక మహాలక్ష్మి గారు....అది అత్తయ్య ఏంటంటే మన సహస్ర కనిపించట్లేదు... అని కుండ బద్దలు