మనసు మమత మహిళ

  • 1.1k
  • 318

స్త్రీవాదం ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాటకానీ ప్రతి ఒక్కరు దీనిని మరొక ఉద్దేశంతో మరొక కోణం లో మాత్రమే చూస్తున్నారుస్త్రీ వాదాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మగవారు అందరూ ఆడవారిని తప్పుగా చూడకూడదు అంటాము. మరి ఆడవాళ్ళ ప్రవర్తన నిజంగా అలా ఉందా అని గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం మాత్రం ఉండదుకానీ...స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ ఏవేవో ఉపన్యాసాలు మాత్రం చెబుతున్నారుఅసలు దీని అవసరం ఎందుకు వచ్చింది అనే ఆలోచనస్త్రీ వాదులు సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలోకి పోయారనినా నమ్మకం.చాలామంది ఆడవారి సామాజిక జీవితాలను మార్చే ప్రయత్నం స్త్రీవాద ముఖ్య లక్ష్యం అంటారు.మరి నిజంగా స్త్రీల ప్రవర్తన అలా ఉందా అని ప్రశ్నిస్తే శూన్యంమానవుడొక్కడికే శరీరంతో బాటు బుద్ది బలం ఇచ్చాడు భగవంతుడు. దానిని వదిలేసి మా శరీరం మా ఇష్టం అనే ప్రవర్తన ,మీరు కళ్లు మూసుకోండి మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాము అందాలు చూపిస్తాము అనే ఆలోచన విపరీతంగా పెరిగిపోయింది ఆడవారిలో