స్కూల్ గేటు దగ్గరకు అందరూ rush అవుతున్నారు.ఉదయం గాలి, పిల్లల హడావిడి, సతీష్ సైకిల్‌ని పార్క్ చేస్తూ “రా, bell కొట్టబోతుంది!” అని అరుస్తున్నాడు.ఇవి అన్నీ సాధారణం… కానీ అబ్బాయికి మాత్రం ప్రతిదీ స్క్రీన్‌పై గ్లిచ్‌లా కనిపించసాగింది.అప్పుడే—ఫోన్ మళ్లీ వైబ్రేట్.అతను మెల్లగా తెరిచి చూస్తాడు.“SKIP ACTION ACTIVATED.”అది కనిపించగానే ఒక్కసారిగా…స్కూల్ చుట్టూ ఉన్న అందరి తలల మీదSKIPSKIPSKIPఅని 3D హోలోగ్రామ్ ట్యాగ్స్‌లా మెరుస్తున్నాయి.తన కళ్ల ముందు జీవం ఉన్న మనుషులు, game charactersలా “select చెయ్యి… లేదా skip చెయ్యి…” అని options ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అబ్బాయి చెమటపట్టిపోతుంది.“ఇది కలా? నిజమా? లేక నన్నే ఎవరో టెస్ట్ చేస్తున్నారా?”అతను భయంతో, ఒత్తిడితో, చేతులతో తలను పట్టుకుని“స్కిప్… స్కిప్… స్కిప్…”అని తన మైండ్‌లో వచ్చిన ఆ పదాన్ని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.ఒక్కసారిగా—అందరి తలల మీద ఉన్న SKIP ట్యాగ్స్ ఒక్కోటి మెల్లగా చీకటిలో కరిగిపోతున్నట్టు మాయమవుతాయి.అబ్బాయి ఊపిరి పీలుస్తాడు.“థ్యాంక్స్ గాడ్… నేను ఇంకా