ఉదయం 10 గంటలు. బస్సు దిగాడు వరుణ్.తను ఆలోచిస్తూ నడుస్తున్నాడు,ఈ రోజు తను చేయబోయేది తప్పా, ఒప్పా అని…. గత 3 నెలలుగా ఆలోచిస్తూనే వున్నాడు.16 ఏళ్ళ వయసున్న వరుణ్ కి అది చాలా పెద్ద సమస్య…అలాగే ఇప్పుడున్న తన పరిస్థితికి ఈ విధంగా చేయడం, చాలా అవసరమని అనుకుంటున్నాడు.రాత్రి 12:30 వరకూ సమయం వుంది. కానీ రోజంతా ఇలా ఆలోచిస్తూ ఉండాలంటే చాలా కష్టం గా అన్పించింది. అప్పటివరకూ టైం పాస్ చేయాలనుకున్నాడు.తనకి తెలిసిన టైం పాస్ సినిమా మాత్రమే. టౌన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొత్త సిన్మాల పోస్టర్లు చాలనే చూశాడు. ఇది సీజన్ కాదు కాబట్టి పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కుడా లేవు. తనకు ఇప్పుడు అవన్నీ ఆలోచించాలని లేదు, ఆటో మాట్లాడుకొని థియేటర్ కి వెళ్ళాడు.………………………………………………………………ఉదయం 11:30 , మార్నింగ్ షోసిన్మా చూస్తూ వేరే విషయం గురుంచి ఆలోచించడం ఇదే మొదటిసారి. తను ఏ