దృశ్యం 1: హాస్పిటల్ ప్రమోషన్ - రుద్ర ఆలోచనఒక పెద్ద బంగ్లా, చుట్టూ ఎవరూ లేరు. ఇంట్లో నుంచి చిన్నగా నవ్వుతున్న శబ్దాలు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో ఒక మనిషి తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఆన్ చేస్తాడు. చూడటానికి చాలా పాతగా కనిపిస్తుంది. దాన్ని ఆన్సర్ చేసిన తర్వాత.."హలో సార్! అదే, మనం హాస్పిటల్ పెట్టాం కదా, దాని గురించి ఏమంటారు? దాని ప్రమోషన్ చేయడానికి యాడ్స్ పూర్తి చేయమన్నారు కదా. ఏజెన్సీ దగ్గరికి వచ్చాము, మీరు ఒక మాట చెప్తే.." అని అడిగాడు అవతలి వ్యక్తి."అవునా.." అని ఒక గంభీరమైన శబ్దం ఆలోచిస్తున్నట్టుగా వచ్చింది. "వాళ్ళు ఏమంటున్నారు?" అని అడిగాడు."అంతే సార్, ఫస్ట్ మన హాస్పిటల్ ని ఒక్కో ఇంచు చూపించి.. అంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ని చూపిస్తూ, మందులు ఎలా ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్లు ఎలా ఉన్నాయి, సౌకర్యంగా ఉన్నాయా లేదా