చీకటి రాత్రి.వాన మొదలు.రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది—ఒక పెళ్లయిన మహిళ. పొట్ట పెద్దగా ఉంది… నొప్పి already మొదలైపోయినట్టే ముఖం చెబుతుంది. ఎవరో వెంబడిస్తున్నట్టు పక్కపక్కకి తిప్పి చూస్తుంది.దూరంగా ఓ ఇల్లు.లైట్‌లేవు… కాని తలుపు ఆడినట్టుంది.ఆ ఇల్లు కనిపించగానే ఆమె అడుగులు slow అవుతాయి—ఆశగా కాదు, భయంతోనైనా ఆశలా కనిపించే ఓ చిన్న గుబులు.లోపల—ఒక యువతి బెడ్ మీద నిలబడి ఉంది.కళ్ళు ఎర్రగా, చేతులు వణుకుతున్నాయి."నేను చేసిన పాపం… నిజంగా ఇంతమందిని చంపిందా?""నన్ను క్షమించే హక్కే లేదు నాకు…"అంటూ ఫ్యాన్‌కు కట్టిన తాడు తన మెడకు వేసుకుని…ఒక్క క్షణం కన్ను మూస్తుంది.తర్వాత—ఫ్యాన్ కొద్దిగా చప్పుడు చేస్తుంది…ఆమె కాళ్లు గాల్లో కొట్టుకుంటాయి… గిలగిలా.అదే సమయంలో తలుపు ఒక్కసారి తెరుచుకుంటుంది.బయట నిండా తడిసిపోయిన ఆ గర్భవతి లోపలికి జారుకుంటుంది.సోఫా వెనుక దాక్కుంటుంది.కానీ కడుపు మెలికలు ఆమెను నిలబడనివ్వవు.నొప్పులు ఒక్కోసారి కత్తిలా గుచ్చుతాయి.గిలగిలా కొట్టుకుంటున్న ఉరేసుకున్న అమ్మాయి శబ్దం—కింద పడిపోయి తల్లడిల్లుతున్న గర్భవతి శ్వాస—వాన శబ్దం—అన్నీ