మిగిలింది జ్ఞాపకాలే

(40)
  • 603
  • 159

సమయం 5:30 సమయాన్ని సూచిస్తోంది. ఒక పాత రైల్వేస్టేషన్జ కానీ నసంచారం లేక ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది....చుట్టూ వీస్తున్న జోరు గాలికి ఎండిన ఆకులు రాలి, అక్కడ ఉన్న ఒక పాత బెంచ్ పైన కూర్చున్న అతడి కాళ్ళ దగ్గర పడ్డాయి. రాలిపోయిన ఆ ఆకులను చూస్తుంటే అతనికి తన పరిస్థితి కూడా అలాంటిదే అని అర్థమైంది... తన కెరీర్ కోసం తను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల, వాళ్ళ బంధం కూడా ఆ ఆకుల్లాగే రాలిపోతుందని అతనికి తెలుసు. కానీ అతని దృష్టి, ధ్యాస అంతా తన లక్ష్యం మీద మాత్రమే ఉంది....​అంతలో అతనికి అడుగుల శబ్దం వినిపించింది. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది. తను వచ్చిందని తెలిసినా రఘు తల పైకి ఎత్తలేదు. అ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె గొంతు వినిపించింది. "కనీసం నా వైపు కూడా చూడాలని అనిపించడం లేదా రఘు..?" అని అడిగింది.... ఆమె