అఖిరా – ఒక ఉనికి కథ - 9

  • 435
  • 120

ఎపిసోడ్ 9ఉదయం సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే అఖిరా లేచింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అభయ్ ఫోన్ స్విచ్ ఆఫ్… వైభవ్ మాటలు…అన్నీ కలిసిపోయి మనసు ఇంకా ఆందోళనలోనే ఉంది. ఏదో తప్పు జరిగిందేమో అనే భయం వదలడం లేదు.కాలేజ్ కి వెళ్లే వరకు ఆమె అడుగులు కూడా వేగంగా పడుతున్నాయి. గేట్ దగ్గరకు చేరగానే కళ్లతో ఒక్కటే వెతుకుతోంది — అభయ్.క్యాంపస్ అంతా చూసింది. క్లాస్ రూమ్… కాంటీన్… లైబ్రరీ… ఎక్కడా కనిపించలేదు. గుండె ఇంకా బలంగా కొట్టుకోవడం మొదలైంది.అప్పుడే దూరంగా పార్కింగ్ దగ్గర ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటున్నట్టు కనిపించారు.అభయ్…అతని ఎదురుగా వైభవ్.అఖిరా అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి.వాళ్లు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేదు. కానీ వైభవ్ ముఖంలో ఒక అర్ధం కాని నవ్వు. అభయ్ మాత్రం ప్రశాంతంగా ఏదో చెప్తున్నాడు. కొన్ని క్షణాల తర్వాత వైభవ్ వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.అభయ్ తిరిగి నడుస్తూ అఖిరా వైపు చూసాడు.ఒక క్షణం కళ్లలోకి చూసి… చిన్నగా