మై ఈవిల్ లవర్ - 2

వీళ్లు ఏదో ఎస్కేప్ ప్లాన్ వేసి గోడ దూకితే....!  మరొకపక్క ఆ పెళ్లి వాళ్ళు వీళ్ళకంటే ముందుగానే బయటికి వచ్చేస్తారు....మన వినయ్ వెంటనే రియాక్ట్ అయ్యి....  అక్కడే మన అఖిల్ కార్ ఉండడంతో  తను లేచి వాళ్ళని లేపి ఇద్దరినీ లాక్కొని వెళ్లి... తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మిగిలిన ఇద్దరిని త్వరగా ఎక్కి చావండి అని అంటాడు...అఖిల్ కార్ ఎక్కకుండా ఆ మండపం వైపే చూస్తూ ఉంటాడు.... పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ముగ్గురుని పట్టుకోవడానికి అని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు... అభయ్ కార్ ఎక్కి వినయ్ నువ్ కార్ స్టార్టింగ్ చెయ్ అని... " అక్కి..! "  బావా...  రారా అని కంగారుగా పిలుస్తాడు...అభయ్ ఎంత పిలిచినా అక్కి అదే మండపం వైపు చూస్తూ ఉండడంతో....అభయ్ తన చెయ్యి పట్టుకొని ఒక గుంజు గుంజేస్తాడు..! దాంతో అక్కీ వచ్చి సీట్లో పడతాడు.! వెంటనే అభయ్ డోర్ వేసేసి లగెత్తరో ఆజాము... అని అంటాడు. వినయ్ వెంటనే కార్