వేద - 17

మేనార్‌లోని ఆ పాత గదుల్లో నిశ్శబ్దం గూడు కట్టుకుంది. అర్జున్ చేతిలో ఉన్న ఆ ఫోటో, దాని వెనుక "ద్వారపాలిక రక్షణ” అని రాయబడి ఉన్న ఆ అక్షరాలు అతని మెదడులో ఒక తుఫానును సృష్టిస్తున్నాయి. కానీహఠాత్తుగా బయట వినిపిస్తున్న ఒక వింతైన శబ్దం ఆ ఆలోచనల నుండి అతన్ని బయటకు లాగింది. అప్పటి వరకు సాధారణంగా ఉన్న సాయంత్రం ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. వేద బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తుండగా, ఆమె కళ్లు నమ్మలేనట్టుగా వెడల్పయ్యాయి.అక్కడ కనిపిస్తున్న ఆకాశం నీలంగా లేదు.. పోనీ నల్లగానూ లేదు. అచ్చం ఎవరో రక్తాన్ని కుమ్మరించినట్టు అది చిక్కటి ఎరుపు రంగులోకి మారిపోయింది. అది సూర్యాస్తమయం వెలుగులా కాకుండా, ఒక హెచ్చరికలా ఉంది. మేనార్ చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో నుంచి పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలోకి ఎగిరాయి. కానీ అవి ఎటు వెళ్లాలో తెలియక పిచ్చివాటిలా మేనార్ గోడలకు తగిలి ప్రాణాలు వదులుతున్నాయి. అలా