సఖి...

  • 153
  • 60

అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు.... కానీ అంతా చీకటితో ఒక స్మశానంలా వెలవెలబోతూ ఉంటుంది.....  ఆ పాలేస్ లో ఒక్క మనిషి కూడా లేకుండా... ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది..! అదే పాలేస్ లోని లాస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ నుంచి ఒక అబ్బాయి గట్టిగా గట్టిగా అరుస్తూ.....నానమ్మ నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు..!? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నువ్వు...!? నన్ను ఒంటరిని చేసేసావు కదా...! చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు....  నువ్వు , తాతయ్య పెంచారు.... తాతయ్య నాకు పది సంవత్సరాలు ఉండగా చనిపోయాడు...! ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు...! ఇప్పుడు నాకు ఎవరు ఉన్నారే..!? నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవచ్చు కదా నానమ్మ..! ఇప్పటివరకు నాతో నటించడానికి వచ్చిన ఆ అమ్మాయి " నిజంగా నా భార్య కాదు..! " నేను నీ దగ్గర ఈ విషయం దాచి... నిన్ను మోసం చేశాను.! నన్ను క్షమించు నానమ్మ