అఖిరా – ఒక ఉనికి కథ - 8

  • 374
  • 105

ఎపిసోడ్ 8కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ అఖిరా మనసంతా ఒక్కటే ఆలోచన.వైభవ్ మాటలు, అభయ్ ముఖం, సత్యతో చేసిన సంభాషణ… అన్నీ కలిసిపోయి తల బరువెక్కినట్టు అనిపిస్తోంది.బస్‌లో కూర్చుని కిటికీ బయట చూస్తున్నా ఏమీ కనిపించడం లేదు.మనసులో మాత్రం అభయ్ పేరు మాత్రమే తిరుగుతోంది.ఈ సర్‌ప్రైజ్ ఏంటో తెలియదు కానీ, ఎందుకో తెలియని ఒక టెన్షన్ కూడా తోడైంది.అఖిరా ఇంటి తలుపు తెరిచిన క్షణమే లోపల నుంచి పిన్నీ ఉత్సాహంగా—“అఖిరా… వచ్చావా? రా రా…” అని పిలిచింది.అఖిరా బ్యాగ్ పక్కన పెట్టి, “ఏమైంది పిన్నీ అంత హడావుడి?” అంటూ లోపలకి అడుగుపెట్టింది.హాల్ లోకి వెళ్లగానే ఒక్కసారిగా అడుగులు ఆగిపోయాయి.సోఫాలో కూర్చుని ఉన్నాడు — వైభవ్.అఖిరా ముఖం రంగు మారిపోయింది.“వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు?” అన్న ప్రశ్న కళ్లలోనే కనిపించింది.పిన్నీ చిరునవ్వుతో, తన చెవులు దెగ్గర వచ్చి ఏంటి షాక్ అయ్యవా ఇదే surprise వైభవ్, నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి