వేద - 13

ఆ భారీ మేనార్ లోపలికి అడుగుపెడుతుంటే వేదకు తన సొంత ఇంటికి వెళ్తున్నట్టు లేదు, కాలం గడ్డకట్టుకుపోయిన ఒక రహస్య సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. గాలిలో పురాతన ధూపం వాసన, వందల ఏళ్ల నాటి తడి ఆరిన గోడల వాసన కలిసి వేదంలో ఒక వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి. వేద అడుగులు తడబడుతున్నా, లోపలి నుండి ఏదో అదృశ్య శక్తి ఆమెను ముందుకు నడిపిస్తోంది.అర్జున్ ఆమె వెంటే లోపలికి రాబోతుండగా, గురుస్వామి హఠాత్తుగా ఆగి, తన చేతిలోని కర్రను నేలకు ఆనించి గంభీరంగా వెనక్కి తిరిగారు. ఆయన కళ్లలో ఒక హెచ్చరిక మెరిసింది."అక్కడే ఆగు నాయనా..! లోపలకు సామాన్య మనుషులకు ప్రవేశం లేదు..! నీది కాని లోకంలోకి, నీకు సంబంధం లేని రహస్యాల మధ్యలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నావు? ఈ గడప దాటడం అంటే నీ జీవితంలోకి సమస్యలను ఆహ్వానించినట్టే. వెనక్కి వెళ్ళిపో.." అని అన్న ఆయన స్వరం లోయలో ప్రతిధ్వనించినట్టు వినిపించింది.గురుస్వామి అన్న