వేద - 12

ముసుగు మనుషుల చేతిపై రుద్ర భైరవ యొక్క Cult of Chaos సంస్థకు చెందిన, త్రిశూలానికి పాము చుట్టుకున్న ఒక గుర్తును చూసాక, ఈ గుర్తుకు, తన తండ్రి మరణానికి మరియు వేదకు ఏదో సంబంధం ఉందని అర్జున్ కు అనుమానం మొదలైంది.ఇంతలో, ఇంటిలోపలికి వెళ్తున్న వేద హఠాత్తుగా కింద పడిపోయింది. అది గమనించిన వెంటనే అర్జున్ బైక్ మీదనుండి దిగి, పరుగున వెళ్ళి వేదను పైకి ఎత్తి ఇంటి లోపలికి తీసుకెళ్ళి, తన బెడ్ పైన పడుకోబెట్టాడు. వేద జీవితంలో ఇంతవరకు జరిగిన సంఘటనలకు, ఆమె మానసికంగా మరియు శారీరకంగా కుంగిపోయింది. వేద స్పృహలో లేనందున, ఆమె రక్షణకోసం అర్జున్ ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెల్లవారింది, చుట్టూ మొత్తం మసక వెలుతురు కమ్మింది. నగరం ఇంకా నిద్రలేవకముందే అర్జున్ కారు రోడ్ల మీద వేగంగా దూసుకుపోతోంది. కారు లోపల నిశ్శబ్దం భయంకరంగా ఉంది. సీటు పక్కన కూర్చున్న వేద భుజానికి తగిలిన గాయం నుండి