రుద్ర భైరవ మనుషులు అర్జున్ ను బెదిరించి వెళ్ళిన తర్వాత, వేదకు ప్రమాదం ఎంతలా ఉందో అర్జున్ కు అర్థమైంది.అదే రోజు సాయంత్రం ఇటు వేద ఉంటున్న చిన్న గదిలో మౌనం భారంగా అనిపిస్తోంది. కిటికీ బయట మేఘాలు కమ్ముకుని చినుకులు పడుతుంటే, లోపల ఒక తుఫానుకు ముందున్న నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.వేద తన గురించి అర్జున్ కు తెలిసి, తనను వెతుకుతూ వచ్చిన విషయం గురించి చింతిస్తూ ఉంది. ఇంతలో, అర్జున్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. అతని మోచేతికి కట్టిన తెల్లటి కట్టు మీద ఇంకా రక్తపు చారలు కనిపిస్తున్నాయి. ముఖం మీద గీసుకుపోయిన గాయాలు, చెదిరిన జుట్టు.. అతని కళ్లలో మాత్రం తను చూసిన నిజాన్ని నిలదీయాలన్న పట్టుదల స్పష్టంగా ఉంది.అర్జున్ రావడాన్ని చూసిన వేద, అతనికేలా తను ఉండే చోటు తెలిసింది అని ఆశ్చర్యంతో 'ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా!' అని మనసులో అనుకున్నా, ఏమీ మాట్లాడలేక మూగబోయింది.నేరుగా వేద