అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్:2.75/5మూవీ: అనగనగా ఒక రాజు నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, రేవంత్ (బుల్లిరాజు) తదితరులు దర్శకత్వం: మారి క్రియేటివ్ డైరెక్టర్: చిన్మయి నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫి: జే యువరాజ్ ఎడిటర్: కల్యాణ్ శంకర్ బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ రిలీజ్ డేట్: 2026-01-14గోదావరి జిల్లాలోని గౌరవపురం గ్రామానికి జమీందారీ కుటుంబానికి యువకుడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఒకప్పుడు సంపన్న కుటుంబమైనప్పటికీ.. తాత చేసిన దుబారా పనుల వల్ల జమీందారీ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. అప్పులు, ఆర్థిక సమస్యలు రాజును వెంటాడుతుంటాయి. బాగా ఆస్థిపాస్తులు ఉండి.. ఎవరైనా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫైనాన్సియల్‌గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకొంటాడు. ఆ వెతుకులాటలో పక్క గ్రామానికి