వేద - 8

ఆ చీకటి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. విద్యుత్ దీపాలు పేలిపోయిన తర్వాత ఆవరించిన ఆ గాఢాంధకారం వేద గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పక్కనే కిటికీ బయట ఏదో నీడ కదిలినట్లు అనిపించినా, అంతకంటే ముందు తన కళ్ళ ముందు టార్చ్ లైట్ పట్టుకుని నిలబడిన ఈ మనిషి నుంచి ఎలా తప్పించుకోవాలా అన్నదే ఆమె తాపత్రయం.ఇటువైపు, అడ్మిన్ ఆఫీస్ బయట నిలబడి ఉన్న అర్జున్, బయట జరిగిన దృశ్యం చూసి, ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇంతవరకు వేద వైపు తరుముకొస్తున్న ఆ చీకటి నీడ ఉన్నట్టుండి మాయమైంది. అది తన భ్రమా లేదా ఇది కూడా వేద చేసిన ఏదైనా మాయా అని ఏదో ఆలోచనలో పడ్డాడు.అర్జున్ టార్చ్ లైట్ వెలుతురు నేరుగా వేద కళ్ళ మీద పడింది. ఆ వెలుగులో ఆమె కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తూ, క్షణక్షణానికీ రంగు మారుతున్న తీరు అతన్ని నివ్వెరపరిచింది."దొరికావు వేద! ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు?" అని