రవితేజ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మూవీ నవ్వించిందా? మాస్ మహారాజాకు హిట్ పడిందా?మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూలో తెలుసుకుందాం.నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళిధర్ గౌడ్, అజయ్ ఘోష్, రోహన్ తిదితరులుదర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్లఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్నిర్మాత: సుధాకర్ చెరుకూరివిడుదల తేది: జనవరి 13, 2026మాస్ మహారాజ రవితేజ ఎనర్జీకి, సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి రవితేజ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రవితేజ