ఎపిసోడ్ 7ఆరోజంతా అఖిరా, వైభవ్ అభయ్ ని ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ దిగులుపడుతూ గడిపేసింది.మరుసటి రోజు హడావుడిగా కాలేజ్‌కు రెడీ అవుతోంది. పిన్నీ కిచెన్ నుంచి,“టిఫిన్ రెడీ అయింది అఖిరా… కాస్త తిని వెళ్ళు,” అని పిలిచింది.“టైం లేదు పిన్నీ… నేను క్యాంటీన్‌లో తింటాను,” అంటూ అఖిరా తొందరగా బయలుదేరింది.కాలేజ్‌కి రాగానే —“అభయ్ ఎక్కడ?”అని క్లాస్‌రూమ్స్, క్యాంటీన్ అన్నీ వెతుకుతూ చివరికి ఆడిటోరియం దగ్గర నిలబడి అటు ఇటు చూస్తోంది.తన కళ్లలో అభయ్‌ని చూడాలనే తపన.మనసులో — అతనికి ఏమైపోతుందో అన్న భయం.ఆ లోపలి వణుకు ఆమెను ఇంకా ఆరాటపెడుతోంది.అప్పుడే వెనకనుంచి ఒక గొంతు —“Excuse me…”ఒకరు ఆమె భుజంపై చెయ్యి పెట్టి పిలిచారు.అఖిరా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.పెదవులపై తెలియని చిరునవ్వు,కళ్లలో తెలియని ఆనందం.తిరిగి చూసింది…అభయ్.ఒక్క క్షణం అలా నిలిచిపోయింది.అభయ్ చిరునవ్వుతో,“Hello… అఖిరా కదా?” అని అడిగాడు.అఖిరా కళ్ళల్లో ఆనందం.“హా… నేనే… నేనే అఖిరా,” అని తడబడుతూ చెప్పింది.“Cool…