రుద్రకోట శిథిలాల మధ్య నుండి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తోంది వేద. అడవి మార్గంలో ఆమె అడుగులు పడుతుంటే ఎండుటాకులు చిటపటలాడటం బదులుగా, ఆ వేగానికి అవి కాలిపోతున్నాయేమో అన్నట్టుగా పొగలు వస్తున్నాయి. వేద గుండె దడదడలాడుతోంది. అది భయం వల్ల వచ్చే వేగమో, లేక తన నరాల్లో ప్రవహిస్తున్న ఆ వింత శక్తి వల్ల కలిగిన ఉద్రేకమో ఆమెకు అర్థం కావడం లేదు.దారిలో ఒక చిన్న నీటి గుంట కనిపించగానే వేద ఒక్కసారిగా ఆగింది. ఆగి, ఆయాసపడుతూ ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నీటి అలల మధ్య కనిపిస్తున్న తన ముఖం ఆమెకే కొత్తగా, భయంకరంగా అనిపించింది. కళ్ళలోని ఆ రక్త వర్ణం మెల్లిమెల్లిగా తగ్గుతూ సాధారణ స్థితికి వస్తోంది. కానీ వేద మెడలోని ఆ 'శరభ ముద్ర' లాకెట్ మాత్రం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది."నేను మనిషినా? లేక మనిషి రూపంలో ఉన్న మృగన్నా? అసలు నాకేమవుతోంది?" అని అనుకున్న