రుద్రకోటలో జరిగిన ప్రమాదంతో, ధూళి మేఘాలు ఆ గదిని కమ్మేశాయి. పైకప్పు నుండి రాలిపడుతున్న సున్నం, మట్టి అనన్య కళ్ళను పూర్తిగా కప్పేస్తున్నాయి. పైన మృత్యువులా వేలాడుతున్న ఆ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా ఊడి కిందకు దూసుకొచ్చింది. ఆ క్షణం అనన్యకు తన మరణం కళ్ళముందు కనిపించింది. "అమ్మో!" అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని నేల మీద ముడుచుకుపోయింది.కానీ, ఆతరువాతి దృశ్యం చూసి అనన్య స్తంభించిపోయింది. ఆమె ఊహించినట్టుగా తన మరణం సంభవించలేదు. దానికి బదులుగా గాలిలో ఒక వింతైన కంపనం.. ఒక ఉగ్రమైన శబ్దం వినిపించింది.వేద మెడలోని 'శరభ ముద్ర' ఇప్పుడు కేవలం వేడెక్కడం కాకుండా, అది అగ్నిగోళంలా మండుతోంది. ఆమె నరనరాల్లో రక్తం ఉడుకుతోంది. అనన్య ఎవరో తెలియకపోయినా, సాటి మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన, ఆమె యొక్క అంతరాత్మలో నిద్రపోతున్న ఆ ప్రాచీన శక్తిని తట్టిలేపింది. దానితో వేద కళ్ళు ఒక్కసారిగా రక్తంలా ఎర్రగా మారాయి. ఆమె చూపుల్లో ఇప్పుడు భయం