అతను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు—జీవితం అందరికీ ఒకేలా మొదలవదు ఒకేలా ఉండదు అని,కానీ అందరూ ఒకేలా మనుసుకి నచ్చిన కలలు కంటాఉంచాడుకలలు మాత్రం చిన్న వయసులోనే బాధ్యతల భారంలో నలిగిపోయాయిబాధ్యతలు మరచిపోయిన తండ్రి ఇంటి మీద పేరుకుపోయిన అప్పులు, మౌనంగా అనారోగ్యం తో అన్ని భరించే తల్లి చెల్లెలి చదువుల ఆశలు ఆ పై తన పెళ్లి కష్టాలు—ఇల అన్నీ అతడిని ఆడుకునే వయసులో ఆలోచించేలా చేసాయి , కలలు కనే వయసులో కష్టపడేలా పెద్దవాడిని చేశాయి. .స్నేహితులు ప్రేమ కథల్లో మునిగితే,అతడు... జీవితం అనే యుద్ధంలో నిశ్శబ్దంగా పోరాటం చేసే వాడు.తన ఆనందాన్ని వాయిదా వేసుకుంటూ,ఇంటి బాధ్యతల్ని ముందుకు నెడుతూ వచ్చాడుఅతడి దృష్టి లో ప్రేమంటే... ఒకరి భుజం కాదు,ఒకరి అర్థం చేసుకునే మనసు.ఏళ్ల తరువాత…ఒక్కొక్క బాధ్యతను తీరుస్తూ,చివరికి కొంత శ్వాస తీసుకునే స్థితికి వచ్చాడు.అప్పుడే అతడికి అనిపించింది—ఇప్పుడైనా తన జీవితంలో ఒకరు ఉండాలని.. ఒక సహచరి ఉండొచ్చేమో అని,