ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, భయంతో వణికిపోతున్నాయి. ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం దాల్చిన ప్రాణి చేస్తున్న హుంకారం.వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.వేద, తెల్లటి కుర్తా వ