అఖిరా – ఒక ఉనికి కథ - 6

  • 342
  • 102

ఎపిసోడ్ 6ఆరోజు రాత్రి ఇంట్లో సువర్ణ, అఖిరా గదిని శుభ్రం చేస్తుండగా తన కబర్డ్‌లో ఒక చెక్ దొరికింది.“అఖిరా!” అని గట్టిగా పిలిచింది.అఖిరా వంటగదిలో నీళ్లు తాగుతోంది. పిలుపు వినగానే,“ఏమైంది?” అని ఒక్క క్షణం ఉలికిపడి,“ఏమైంది పిన్ని?” అంటూ గదికి పరుగెత్తుకుంటూ వచ్చింది.పిన్ని చేతుల్లో ఉన్న చెక్ చూసి అఖిరా నవ్వుతూ వచ్చి పిన్నిని కౌగిలించుకుంది.“ఇది మీ ఆపరేషన్‌కే పిన్ని. పోయిన వారం ఈవెంట్‌కి వెళ్లాను కదా, అక్కడ ఇచ్చిందే,” అని చిరునవ్వుతో చెప్పింది.ఆ క్షణం సువర్ణ, అఖిరా కళ్లలో తన మీద ఉన్న ప్రేమను చూసింది.“ఎందుకే నా కోసం ఇంత కష్టపడుతున్నావు?” అంటూ కన్నీరు కార్చింది.అఖిరా సువర్ణ చేయి పట్టుకుని,“నాకు నువ్వు, నిక్కీ తప్ప ఇంకెవరున్నారు పిన్ని? మీకోసం కాకపోతే ఇంకెవరికి చేస్తాను? మీరు నా ఫ్యామిలీ కదా పిన్ని,” అని అనగానే అఖిరా కళ్లలో నీళ్లు తిరిగాయి.ఇంతలో నిక్కీ గదిలోకి వచ్చి అఖిరా, సువర్ణ ఇద్దరినీ కౌగిలించుకుంది.సువర్ణ కన్నీళ్లు