మొక్కట్రావ్ పేట వూరు..కరీంనగర్ కి 70 కిలోమీటరు దూరం లో వుంది..కరీంనగర్ నుంచి మంచిర్యాల రహదారి కి 5 కిలోమీటరు దూరం లో వుంది ఆ వూరు. రెండు కొండల మధ్య నుంచి ఆ వూరికి కి దారి వుంది..వూరు చాలా ప్రశాంతంగా వుంది.వూరి ప్రారంభం నుంచి చివరి వరకు ఒక పెద్ద సీసీరోడ్ వుంది.ఆ సీసీ రోడ్ దాటి అలాగే ముందుకు వెళ్తే కొంచం దూరం లో గోదావరి వస్తుంది.ఆ వూరికి దగ్గరలోనే కోటి లింగాల గుడి వుంది.శాతవాహనుల మొట్ట మొదటి రాజధాని కోటిలింగాల అదే ఈ గుడి.ఊరిలోకి అందరం ట్రాక్టర్ లో వెళ్లి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము.ఒక గోళ్లవారి ఇంట్లో అద్దెకు దిగాము మేము.ఒక రూమ్ లో బాబాయ్ వాళ్ళు వుండేది..ఒక రూమ్ లో ఇంటి ఓనర్ వాళ్ళు వుండేవారు.అదే ఇంట్లో హల్ లో మేము అక్కడే వండుకొని తిని పక్కకు పడుకొనే వాళ్ళము.మొదట్లో వాళ్లకు మా