ఒకరు వద్దు అని చెప్పారు అంటే అది వద్దు అని అర్ధం. అది కూడా పర్టిక్యులర్ గా ఒక అమ్మాయి వద్దు అంది అంటే అసలు వద్దు అని అర్ధం. ఈ డైలాగ్ ఏ సినిమా అని చెప్పనవసరం లేదు అనుకుంటా కదా! ఎస్ అలా వైకుంఠపురంలోనిది.ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అనే కదా మీ డౌట్. నిన్న ఒక సినిమా చూసా. కేవలం లాస్ట్ లో ఒక డైలాగ్ విని అక్కడే ఆగిపోయింది నా ఆలోచన, మనసు కూడా.అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది చాలా సున్నితమైన విషయం.ఇక్కడ చెప్పడం కరెక్ట్ నో కాదో నాకు తెలియదు కానీ చాలాసేపు ఆలోచించి రాస్తున్న.భార్య భర్తల మధ్య సున్నితమైన బంధం గురించి. అది చెప్పే ముందు మరొక మాట.మనం ఉదయం లేచిన దగ్గర నుండి టీవీ న్యూస్ లో కావచ్చు , సోషల్ మీడియాలో కావచ్చు వినే విషయం ఆడపిల్ల